Kolu Kolo Koloyamma | Virata Parvam​​ | Rana Daggubati, Sai Pallavi |

కోలు కోలో కోలోయమ్మ - Lyrical Song


కోలు కోలో కోలోయమ్మ -  | Virata Parvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili
Singer Divya,Suresh
Composer Suresh Bobbili
Music Suresh Bobbili
Song WriterChandrabose

Lyrics

కోలు కోలో కోలోయమ్మ కొమ్మా చివరన పూలు పూసే కోలో
పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా
వాడి గూర్చి ఆలోచనే వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే


కోలు కోలో కోలోయమ్మ - | Virata Parvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili Watch Video

Comments

Popular posts from this blog

KESARIYA - BRAHMASTRA (Hindi/Telugu/Tamil Lyrics)

Raataan Lambiyan - Jubin Nautiyal, Asees Kaur

Nuvvo Rayi Neno Silphi - Private Song